దీపారాధనలో ఉపయోగించిన ఒత్తులను, బూడిదను పవిత్రంగా భావించాలి. ఒత్తులు కాలిన తర్వాత సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి కాలి బూడిదైన ఒత్తులను చెత్త బుట్టలో వేయొద్దు. కాలిన ఒత్తులను 10 రోజులపాటు సేకరించి 11వ రోజు దీపపు కందులో వేయాలి. అందులో కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. తద్వారా వచ్చిన ధూపం పొగను ఇల్లంతా వచ్చేలా తిప్పాలి. మిగిలిన బూడిదను బొట్టు పెట్టుకుంటే మంచిది.