జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అమలుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 191 దరఖాస్తులు ,167 మంది లబ్ధిదారులకు రూ. 26,60,000 ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలిపారు. మిగితా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన నిధులు విడుదల చేయాలని తెలిపారు.