TG: ములుగు జిల్లా మేడారంలో ఇవాళ మంత్రులు పర్యటించనున్నారు. మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వీరు పరిశీలించనున్నారు. ఈ మేరకు పొంగులేని శ్రీనివాస్, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మన్ ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకుంటారు. ఈ పరిశీలన అనంతరం సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షిస్తారు.