PLD: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సత్తేనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి తెలిపారు. ర్యాలీ అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.