MBNR: అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో కేంద్రాలకు ఎంత మంది హాజరవుతున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు.