KDP: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, మరో 20 మంది తీవ్రంగా గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. జాతీయ జెండా ఎగురవేసే ఎర్రకోట వద్దే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.