HNK: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ కాజీపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో సోమవారం రాత్రి సీఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫాం మీద ప్రయాణికులు, అనుమానితులు, వారి లగేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.