ADB: ప్రజాకవి అందేశ్రీ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ పట్టణంలోని CPM పార్టీ కార్యాలయంలో ఇవాళ సంతాప సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అధికారిక గీతాన్ని రాసిన అందెశ్రీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు పని చేయాలని కోరారు.