VSP: తోటగురువు గ్రామంలో గల తోటనందీశ్వర ఆలయంలో కార్తీక మూడో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు తెల్లవారుజామునే అధిక సంఖ్యలో చేరుకుని పూజలు చేశారు. గత 20 ఏళ్లుగా ఈ గుడి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ తెలిపింది.