కోనసీమ: స్వయంభు క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం కార్తీకమాసం మూడోవ సోమవారం సందర్భంగా భక్తులతో కిటికిటలాడింది. వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.