VSP: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సందర్శకులుతో ఆదివారం కిటకిటలాడింది. ఈరోజు మొత్తం 7,865 మంది సందర్శకులు జూ పార్క్‌ను సందర్శించారని క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. దీంతో రూ.6,07,640 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో జూపార్క్ అంతా సందడి వాతావరణం నెలకొంది.