VZM: ఈనెల 23న శ్రీ సత్యసాయి బాబా పుట్టినరోజు సందర్బంగా విశ్వశాంతి కొరకు ప్రపంచ వ్యాప్తంగా 155 దేశాల్లో శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు ప్రత్యేక గ్లోబల్ అఖండ భజనలు నిర్వహించారు. అందులో భాగంగా కొత్తవలస పాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి బాబా మందిరంలో గ్లోబల్ అఖండ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.