కృష్ణా: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలనే మంత్రి నారా లోకేష్ ఆలోచన అభినందనీయమని డీప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆదివారం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులను ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.