TG: మరో మూడేళ్లు అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గెలిస్తే మూడేళ్లు ఉంటారో.. మూడు నెలలు ఉంటారో తెలుస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఖమ్మం, నల్గొండ నేతలు కత్తులు నూరుతున్నారని చెప్పారు. ఎల్లుండి ఎన్నికల్లో ఆ కుర్చీని మడతపెట్టి.. ఏం చేయాలో ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.