KNR: వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 13న హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పట్టణ బీజేపీ అధ్యక్షులు తూర్పాటి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొన్ని గీతాలాపన కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.