KKD: గండేపల్లి మండలం రామయ్య పాలెం శివారున ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వరి కోత కోస్తున్న యంత్రానికి విద్యుత్ వైర్లు తగలడంతో యంత్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.