AP: సీఐఐ భాగస్వామ్య సదస్సు ఉత్తరాంధ్ర జిల్లాలకు గుర్తింపు తీసుకురానుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజన గ్రామాలంటే ఒకప్పుడు డోలీ మోతలే కనపడేవని.. కూటమి ప్రభుత్వంలో ఆ ప్రాంతాలు పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేవారికి ఉత్తరాంధ్ర పర్యాటక అనుభూతి కలుగుతుందన్నారు. 96 గిరిజన గ్రామాలకు రోడ్ల కోసం ఇప్పటికే రూ.28 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.