చాలా మంది ఉదయం ఆఫీసుకు వెళ్లినప్పటి నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు. వారాంతపు వినోదాల కోసం ఎదురుచూస్తూ వారమంతా గడుపుతారు. కొత్త ఏడాదిలో అయినా తమ జీవితం మారుతుందేమో అని ఈ ఏడాదంతా కలలు కంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఇలా అందమైన రేపటి కోసం ఎదురుచూస్తూ ప్రస్తుత క్షణాలు ఆస్వాదించడం మర్చిపోకండి.