MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ ఎర్రగుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు ఇస్తామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు అధికారులతో కలిసి నివాసం ఉంటున్న వారి ధృవపత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన స్థానిక లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు.