KNR: సైదాపూర్ మండలంలో గత నెల 29న మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైన రోడ్లకు శనివారం రోడ్లు భవనాల శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సోమారం చౌరస్తా వద్ద వరదనీరు ప్రవహించడంతో రోడ్డు భారీగా కోతకు గురైంది. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు వెంటనే స్పందించి, ఆ ప్రాంతంలో మొరం పోసి మరమ్మతు పనులను వేగవంతం చేశారు.