JGL: ప్రజాజీవితంలో నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని జగిత్యాల MLA సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి ఆరోపణలు అర్థరహితమన్నారు. తాను ప్రజా సేవకుడిగా పారదర్శకంగా పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు ఎప్పటికీ మద్దతు ఇవ్వనని స్పష్టంచేశారు.