గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. అయితే, భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. మైదానంలో పిచ్ ప్రాంతంలో మాత్రమే సిబ్బంది కవర్లు కప్పారు. అయితే, గ్రౌండ్లో డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉండటంతో వర్షం నిలిచిన కాసేపటికే మైదానాన్ని సిద్ధం చేసే ఛాన్స్ ఉంది. దీంతో వర్షం తగ్గుతుందేమో అని ప్రేక్షకులు ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు.