శ్రీకాకుళం నగరంలోని ప్రజా సదన్‌లో శనివారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో ఆయనకు అందజేశారు. దరఖాస్తులను పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.