KKD: పిఠాపురంలోని జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన అంధురాలు మట్టం జ్యోతి తనకు పింఛన్ ఇప్పించాలని కోరుతోంది. ఎన్నో ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ పింఛన్ మంజూరు కాలేదని ఆమె తెలిపింది. గతంలో జనసేన నాయకులను కలిసినా ఫలితం దక్కలేదని వాపోతోంది. Dy. CM పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని, తనకు వెంటనే పింఛన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జ్యోతి వేడుకుంటోంది.