బీహార్ చేపలను చూడటానికి పెద్దపెద్దవాళ్లు వస్తున్నారు అంటూ ప్రధాని మోదీ విమర్శించారు. ఇటీవల బెగుసరాయ్ జిల్లాలో మత్స్యకారులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపల వేటకు వెళ్లారు. ఆ ఘటనను ప్రస్తావిస్తూ మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల్లో మునిగిపోయేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.