బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ‘మేము చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తాం, వారిని దేశం నుంచి బహిష్కరిస్తాం. దేశంలో వారికి చోటు లేదు’ అని లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీని ఉద్దేశించి హెచ్చరించారు. ‘జంగిల్ రాజ్’ పేరుతో లాలూ ప్రసాద్-రబ్రీ దేవిల 15 ఏళ్ల పాలనలో జరిగిన హత్యలు, దోపిడీలపై ధ్వజమెత్తారు.