కడప: జిల్లా పోలీసు కార్యాలయంలో భక్త కనకదాస జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ(ఏఆర్) బి. రమణయ్య కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలను తొలగించేందుకు కనకదాస చేసిన కృషి ఆదర్శనీయని కొనియాడారు. ఆయన రచనలు మానవతా విలువలకు మార్గదర్శకం అన్నారు.