భారత్-ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్‌కు గబ్బా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా ఉండే ఈ పిచ్‌పై ఆసీస్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2013 నుంచి ఇక్కడ జరిగిన 8 టీ20ల్లో ఆస్ట్రేలియా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. దీంతో, రేపటి మ్యాచ్‌లో ఆసీస్ పేస్ దాడిని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.