KNR: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలోనే రాష్ట్రం సుభిక్షమవుతుందనే ఆశాభావాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తం చేశారు. శనివారం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి కార్యశూరుడే కాకుండా పాలనా దక్షకుడని కూడా నిరూపించుకున్నారని ఆయన పేర్కొన్నారు.