KKD: జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ జిల్లా యుటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పీవీ సత్యనారాయణ అధ్యక్షతన నూతన టీచర్ల సర్వీస్ రిజిస్టర్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై నూతన టీచర్లకు సర్వీస్ రిజిస్టర్లు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.