గుంటూరు నగరంలో గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్న ఏడుగురు యువకులను, ఓ మైనర్ బాలుడిని నగరంపాలెం పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 30 వేల నగదు, 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఖాళీ స్థలంలో యువకులు గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసినట్లు డీఎస్పీ అరవింద్ తెలిపారు.