TG: జూబ్లీహిల్స్ ఎన్నికలు వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో నాలుగు కోట్ల ప్రజలు కాదని.. నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఓటు వేయకుంటే.. రేషన్ కార్డులు పోతాయని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.