AP: అక్రమాస్తుల కేసులో CBI కోర్టులో మాజీ CM జగన్ మెమో దాఖలు చేశారు. ఈనెల 14లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో జగన్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు గడువు సమీపిస్తుండటంతో మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహాయించాలని.. కోర్టు తప్పనిసరిగా హాజరుకావాలంటే సిద్ధమని పేర్కొన్నారు. కోర్టు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానన్నారు.