NZB: జిల్లాలో సుమారు 12 ఏళ్లుగా ప్రతిసారి ధాన్యం కొనుగోలు సమస్య ఏర్పడుతోందని, అయినా ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏటా పంట చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగుల కొరత, లేబర్ కొరత ఉండటం శోచనీయమన్నారు.