AP: గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని YCP అధినేత జగన్ ఆరోపించారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై మాట్లాడారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు చెడు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమన్నారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు. మంచి రాజకీయాలకు విద్యార్థి దశలోనే బీజం పడుతుందన్నారు.