JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని ప్రాచీన కోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోదావరి తీరం దీపాలతో కళకళలాడగా, అర్చకులు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. స్థానిక భక్తులు, మహిళా సంఘాలు, సేవా సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.