MDK: కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం ఆయన కొనుగోలు తీరును పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు జరపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.