CTR: రాష్ట్ర వాలీబాల్ జట్టుకు అండర్ -19 విభాగంలో పలమనేరుకు చెందిన అబ్దుర్ రెహమాన్ ఖాన్ ఎంపికయ్యాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రెహమాన్ ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్ జిల్లాల పోటీల్లో జిల్లా జట్టుకు ఆడి ప్రతిభ కనబరిచాడు. దీంతో జాతీయ స్థాయిలో ఆడే అవకాశం దక్కింది.