GNTR: ఆర్టీసీ ప్రయాణికుల పట్ల బస్టాండ్లో వ్యాపారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ప్రజారవాణా అధికారి డి.సామ్రాజ్యం సూచించారు. గుంటూరు బస్టాండ్లోని సమావేశ మందిరంలో మంగళవారం బస్టాండ్లోని స్టాల్స్ యజమానులతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని, నెలవారి అద్దెలు సక్రమంగా చెల్లించాలని కోరారు.