జనగామ మండలంలోని గానుగాపహడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయని, వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఉత్సవ విగ్రహంగా ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులకు గానుగాపహడ్ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.