KKD: తాళ్లరేవు మండలం కోరంగిలోని మడ అడవులను జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు శుక్రవారం సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సందర్శకుల కోసం చేసిన ఏర్పాట్లను రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ వర ప్రసాద్ ఆయనకు వివరించారు. తుఫాన్ అనంతరం అక్కడి వాతావరణం పరిశీలించేందుకు DFO విచ్చేశారు. సందర్శకుల రాక ఇప్పుడే మొదలైందని ఆయనకు తెలిపారు.