కార్తీకమాసంలో అన్నిరోజులు మంచి రోజులే. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో చేసే పూజ అత్యంత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిది. ఈ మాసంలో రోజూ ఉపవాసం ఉండేవారికి దక్కని పుణ్యం.. ఒక్క కార్తీకమాసంలో ఉపవాసముండే భక్తునికి వరిస్తుందని నమ్మకం.