SRD: సంగారెడ్డి పట్టణ పరిధి పోతారెడ్డిపల్లి చౌరస్తా వద్ద హోటళ్లకు మున్సిపల్ అధికారులు భారీ జరిమానా విధించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సయ్యద్ సాజిద్, వార్డ్ ఆఫీసర్లు హోటల్ పై దాడులు చేశారు. హోటళ్లలో కుళ్ళిన మాంసం, చికెన్ నిల్వ ఉండడంతో గుర్తించిన అధికారులు రూ. 40 వేల జరిమానా విధించారు. తాజా మాంసం, చికెన్ అందజేయాలని సూచించారు.