KNR: బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు అవసరైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లపై ఆరు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.