NGKL: కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శక్తివంతమైన కుటుంబం సాధ్యమవుతుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలో ‘ఆరోగ్య మహిళ – శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.