KNR: కరీంనగర్ పట్టణం భగత్‌నగర్‌లో సాయి కృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న లీగల్ మెట్రోలజీ (తూనికలు, కొలతలు) కార్యాలయాలను LMD కాలనీ, మహాత్మా నగర్ (తిమ్మాపూర్ మండలం), సర్వే నంబర్ 443లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనంలోకి మార్చారు. ఈ కొత్త భవనంలో లీగల్ మెట్రోలజీకి సంబంధించిన మూడు విభాగాల కార్యాలయాలను మార్చారు. ప్రజలు ఇకపై కొత్త చిరునామాలో సేవలు పొందాలన్నారు.