MBNR: ఆషాడమాస బోనాల ఉత్సవాలు HYDలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా MBNR ఎంపీ డీకే అరుణ ఓల్డ్ సిటీలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి ఆమె బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.