KMM: ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ & డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 44 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 6 కార్లు, 2 ఆటోలు, 36 మంది ద్విచక్ర వాహనదారులు మధ్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.