E.G: కడియం మండలం కడియపులంకలో ఆదివారం గంజాయి విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారంపై కడియం పోలీస్ స్టేషన్ ఎస్సై BND ప్రసాద్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా గంజాయి అమ్ముతున్నఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు.