ATP: రాప్తాడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014-19 మధ్య చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, తమపై అక్రమంగా బనాయించిన కేసులను మాఫీ చేయాలని కార్యకర్తలు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.